logo

జలం కోసం జనం ఆందోళన

మండలంలోని కులుమాల గ్రామంలో నెలలు తరబడిగా వేధిస్తున్న తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్థులు సోమవారం గోనెగండ్లలోని మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు.

Published : 30 Apr 2024 04:12 IST

రెండు నెలలుగా నిలిచిన సరఫరా

ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో  
ఆందోళన చేస్తున్న కులుమాల గ్రామస్థులు

గోనెగండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని కులుమాల గ్రామంలో నెలలు తరబడిగా వేధిస్తున్న తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్థులు సోమవారం గోనెగండ్లలోని మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు. భాజపా నాయకుల ఆధ్వర్యంలో అరగంటపాటు ఎంపీడీవో కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. ఎంపీడీవో సోనుబాయ్‌కు వినతిప్రతం అందించారు. గ్రామంలో రెండు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు నాగరాజు, మద్దిలేటి, కొండన్న, దర్గన్న, దస్తగిరి, చంద్రన్న, శేషు ఎంపీడీవోకు మొరపెట్టుకున్నారు. పది రోజులకోసారైనా కాలనీలకు నీరు సరఫరా కావడం లేదన్నారు. రాజకీయ నాయకుల ఇళ్లకు మాత్రం నిత్యం సరఫరా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామంలో కొత్త, పాత బీసీ కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. సమస్య పరిష్కారానికి ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని ఎంపీడీవో సమాధానం చెప్పడంతో వెనుదిరిగారు. భాజపా నాయకులు రవికుమార్‌నాయుడు, భీమనాయుడు, మల్లికార్జున పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని