logo

బాలికలదే హవా

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు ముందు వరుసలో నిలిచారు. జిల్లాలో 88.47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 91.57, బాలురు 85.3 శాతం పాసయ్యారు. ఈసారి 10 జీపీˆఏ 255 మంది సాధించారు. వారిలో ప్రైవేటు విద్యార్థులు 215 మంది ఉన్నారు.

Published : 01 Jul 2022 06:22 IST

పదో తరగతి పరీక్షల అనంతరం విజయ చిహ్నం చూపుతున్న విద్యార్థులు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు ముందు వరుసలో నిలిచారు. జిల్లాలో 88.47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 91.57, బాలురు 85.3 శాతం పాసయ్యారు. ఈసారి 10 జీపీˆఏ 255 మంది సాధించారు. వారిలో ప్రైవేటు విద్యార్థులు 215 మంది ఉన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలో ఒక్కరు, బీసీˆ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 19 మంది, కేజీబీవీల్లో నలుగురు, ఆదర్శ పాఠశాలల్లో ఒక్కరు, మినీ గురుకుల విద్యాలయాల్లో ముగ్గురు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 9 మంది, జిల్లా పరిషత్తు పాఠశాలల పరిధిలో ముగ్గురున్నారు.
* మహాత్మాజ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల సంస్థ పరిధిలో బూర్గుపల్లి(బాలుర) పాఠశాలలో 74 మందికిగాను అందరూ ఉత్తీర్ణత సాధించారు. భూత్పూరు(బాలికల) పాఠశాల-75, హన్వాడ(బాలికల) పాఠశాల-79, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హన్వాడ-59, ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల-12, మోతీనగర్‌ ఉన్నత పాఠశాల-9, జడ్పీహెచ్‌ఎస్‌ నిజాలాపూర్‌-18, జడ్పీహెచ్‌ఎస్‌ తాటిపర్తి-24, జడ్పీహెచ్‌ఎస్‌ సూరారం-26, జడ్పీహెచ్‌ఎస్‌ ఉర్దూమీడియం వేపూర్‌-5 మంది ఉత్తీర్ణత సాధించారు. మహబూబ్‌నగర్‌ గ్రామీణ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం-47, రాజాపూర్‌ కేజీబీవీ-41, బాలానగర్‌లోని తెలంగాణ రెసిడెన్సియల్‌ పాఠశాల-79, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం (బాలికలు) నంచర్ల-80, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌(బాలుర) బాలానగర్‌-80, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌, జూనియర్‌ కళాశాల (బాలుర) దేవరకద్రలో 79 మందికి అందరూ ఉత్తీర్ణత సాధించారు.
*  ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉత్తీర్ణత 91.56, బీసీˆ వెల్ఫేర్‌-100, ప్రభుత్వ పాఠశాలల్లో 77.37, కేజీబీవీల్లో 92.96, ఆదర్శ పాఠశాలల్లో 96.90, ప్రైవేటు పాఠశాలల్లో 96.03, తెలంగాణ రెసిడెన్సియల్‌లో 100, మినీ గురుకులాల్లో 91.81, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 98.99, ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో 96.47, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 82.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని