logo

వసతి గృహంలో షార్ట్‌ఫిలిం చిత్రీకరణపై ఘర్షణ

మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో సోమవారం రాత్రి కొందరు బయటి వ్యక్తులు చొరబడి షార్ట్‌ఫిలిం చిత్రీకరించడంపై ఘర్షణ చోటు చేసుకొంది. పాత ఠాణాలో హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు.

Published : 27 Mar 2024 02:11 IST

లింగాల, న్యూస్‌టుడే : మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో సోమవారం రాత్రి కొందరు బయటి వ్యక్తులు చొరబడి షార్ట్‌ఫిలిం చిత్రీకరించడంపై ఘర్షణ చోటు చేసుకొంది. పాత ఠాణాలో హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అనుమతి లేకుండా వసతి గృహంలోకి చొరబడి పాత లాకప్‌ గదిలో సన్నివేశాలు చిత్రీకరించారు. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చిత్రీకరణను అడ్డుకోబోయిన హాస్టల్‌ వర్కర్‌పై షార్ట్‌ ఫిలింకు సంబంధించిన వ్యక్తులు దాడి చేశారు. వర్కర్‌ స్థానిక పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. వసతి గృహంలో రాత్రిపూట రక్షణ కొరవడిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా సమయంలో వార్డెన్‌ స్థానికంగా లేరు. ఈ వ్యవహారంపై వార్డెన్‌ తిరుపతయ్యను వివరణ కోరగా హాస్టల్‌లో చోటుచేసుకొన్న వ్యవహారం వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని