logo

బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

మహబూబ్‌నగర్‌ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

Published : 29 Mar 2024 03:42 IST

సుదర్శన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించి అనంతరం ఫలితాలను ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా ఎ.సుదర్శన్‌రెడ్డి గెలుపొందారు. ఆయనకు 235 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి రవికుమార్‌ యాదవ్‌కు 164 ఓట్లు వచ్చాయి. దీంతో 71 ఓట్లతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా రామనాథ్‌గౌడ్‌ విజయం సాధించారు. ఆయనకు 207 ఓట్లు రాగా, ఈ పదవి కోసం పోటీ చేసిన నరసింహారెడ్డికి 124, లక్ష్మారెడ్డికి 68 ఓట్లు వచ్చాయి. కోశాధికారి పోస్టుకు పోటీ చేసిన శివరాజ్‌కు 217 ఓట్లు రాగా, వెంకట్రావుకు 187 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా శ్రీరామగౌడ్‌, సంయుక్త కార్యదర్శిగా నాగోజీ, గ్రంథాలయ కార్యదర్శిగా మల్లికార్జున్‌, కార్యవర్గ సభ్యులుగా కరుణకాంత్‌, ఇలియాస్‌ హుస్సేన్‌, నరేందర్‌నాయక్‌, నరేశ్‌ గౌడ్‌, రమేశ్‌, సాహితి శివానంద్‌, ఉత్తమ్‌కుమార్‌, వినోద్‌కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలిపొందిన వారిని సంఘం సహకార సంఘం అధ్యక్షుడు ఆనందరావు, సంఘం మాజీ అధ్యక్షులు చంద్రమౌళి, అనంత్‌రెడ్డి, రవికుమార్‌ యాదవ్‌, మనోహర్‌, బాలస్వామి, ఉమామహేశ్వరీ పాల్గొన్నారు.

జంగయ్య

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: జడ్చర్ల న్యాయవాదుల సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడుకె.జంగయ్య గురువారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వాహణాధికారిగా ఉదయరాజు వ్యవహరించారు. అధ్యక్షుడిగా కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆర్‌.శ్రీనివాసులుగౌడ్‌, ఉపాధ్యక్షుడిగా బి.యాదిరెడ్డి, కోశాధికారిగా వి.శ్రీశైలం, కార్యదర్శిగా ఎస్‌.రాములు, గ్రంథాలయ కార్యదర్శిగా అమీనోద్దీన్‌, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా ఎస్‌.శ్రీనివాస్‌, సభ్యులుగా కె.శ్రీకాంత్‌, కె.రఘురాం, ఎస్‌.ఏ హఫీజా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన న్యాయవాదులకు అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.


బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రఘురాంరెడ్డి

గద్వాల అర్బన్‌, న్యూస్‌టుడే: గద్వాల బార్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది రఘురాంరెడ్డి ఎన్నికయ్యారు. గురువారం బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారులుగా న్యాయవాదులు ఇస్మాయిల్‌, నాగరాజులు వ్యవహరించారు. బార్‌ అసోసియేషన్‌లో మొత్తం 154 ఓట్లుండగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు మాత్రమే నిర్వహించిన ఎన్నికలో 144 ఓట్లు పోలవగా, 3 చెల్లలేదు. అధ్యక్ష పదవికి రఘురాంరెడ్డి, విజయ్‌ మోహన్‌రెడ్డి పోటీపడగా రఘురాంరెడ్డి విజయ్‌మోహన్‌రెడ్డిపై 26 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. రఘురాంరెడ్డికి 84 ఓట్లు (పోస్టల్‌ 13, జనరల్‌ 71) రాగా, విజయ్‌మోహన్‌రెడ్డికి 58 ఓట్లు (పోస్టల్‌ 9, జనరల్‌ 49) వచ్చాయి. ప్రధాన కార్యదర్శి పదవికి జయసింహారెడ్డి, కొండాపురం షఫీవుల్లా పోటీ పడ్డారు. షఫీవుల్లా 13 ఓట్ల మెజార్టీతో జయసింహారెడ్డితో విజయం సాధించాడు. జయసింహారెడ్డి 65 ఓట్లు (పోస్టల్‌ 9, జనరల్‌ 56) రాగా షఫీవుల్లాకు 78 ఓట్లు (పోస్టల్‌ 13, జనరల్‌ 65) వచ్చాయి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిల విజయాన్ని ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు.

కార్యవర్గం: మిగతా వారు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఉపాధ్యక్షునిగా ఖాజామొయినుద్దీన్‌, కోశాధికారిగా ఆనంద్‌రావు, సంయుక్త కార్యదర్శిగా రాజు, క్రీడా కార్యదర్శిగా సురేశ్‌గౌడ్‌, గ్రంథాలయ కార్యదర్శిగా రామకృష్ణ, మహిళా ప్రతినిధిగా వరలక్ష్మి, కార్యనిర్వాహక సభ్యులుగా నారాయణరెడ్డి, దామోదర్‌, ప్రభాకర్‌, నర్సింహులు, శ్రీనిత, మహమ్మద్‌ సిరాజ్‌లు ఎంపికైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రఘురాంరెడ్డి, కొండాపురం షఫీవుల్లాను బార్‌ అసోసియేషన్‌ సభ్యులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని