logo

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ

ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.

Published : 24 Apr 2024 06:07 IST

సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి

మిడ్జిల్‌, న్యూస్‌టుడే : ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిడ్జిల్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మిడ్జిల్‌, ఊర్కొండ మండలాల కార్యకర్తల లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మండల అధ్యక్షుడు పాండు యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ భాజపా, కాంగ్రెస్‌లను ఎన్నికల్లో ఓడించడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి నేడు పార్టీలు మారుతున్న నాయకులను భవిష్యత్తులో తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, పూటకో మాట చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్‌, భాజపాలపై వ్యతిరేకత పెరిగిందని, గత భారాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలు లబ్ధి పొందారని పేర్కొన్నారు. జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ యాదయ్య, ఎంపీపీ సుదర్శన్‌, నాయకులు బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వీరారెడ్డి, బాలస్వామి, అరుణ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, జంగయ్య, జంగారెడ్డి, జైపాల్‌రెడ్డి, ఎల్లయ్య యాదవ్‌, చంద్రశేఖర్‌, బంగారు, వరుణ్‌రాజు, జగన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని