logo

రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Published : 24 Apr 2024 06:18 IST

మహబూబ్‌నగర్‌ : గాంధీరోడ్‌ ఉన్నత పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు రాసి వస్తున్న అభ్యర్థులు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 25 నుంచి మే 2 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఉమ్మడి పాలమూరులో 26 కేంద్రాలు సిద్ధం చేశారు. ఇందులో 20 ఇంటర్‌కు, 16 పదో తరగతికి కేటాయించారు. 7,038 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా కేంద్రాల్లో ఇప్పటికే పరీక్ష నిర్వహణకు ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, అవసరమైన ఇన్విజిలేటర్లను నియమించారు. రాత పరీక్షల తర్వాత ఇంటర్‌ విద్యార్థులకు మే 3 నుంచి 10 వరకు ప్రయోగ పరీక్షలు (ప్రాక్టికల్స్‌) నిర్వహించనున్నారు.

సకాలంలో హాజరు కావాలి : అభ్యర్థులు నిర్దేశిత సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేసవి ఎండల దృష్ట్యా కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు. అవసరమైన వారికి ప్రథమ చికిత్స అందిస్తారు. అత్యవసర సేవలకు అంబులెన్స్‌ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వం.

రాంసుభాష్‌గౌడ్‌, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని