logo

కాలుష్యం తగ్గి.. హరితం సిద్ధించేలా!

హైదరాబాద్‌ మహా నగరానికి చేరువులో జిన్నారం మండలం ఖాజీపల్లిలో 1650 ఎకరాల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి.

Updated : 30 Mar 2023 06:18 IST

కిష్టాయపల్లి శివారు అడవిలో ప్లాంటేషన్‌ పనులు

మొక్కలు నాటేందుకు చదును చేసిన ప్రాంతం

న్యూస్‌టుడే, జిన్నారం: హైదరాబాద్‌ మహా నగరానికి చేరువులో జిన్నారం మండలం ఖాజీపల్లిలో 1650 ఎకరాల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రముఖ సినీ నటుడు ప్రభాస్‌ దత్తత తీసుకొని రూ.2 కోట్ల విరాళం ఇచ్చారు. అటవీ అభివృద్ది పనుల్లో భాగంగా సీత్రూ వాల్‌ నిర్మాణంతో పాటు మరికొన్ని పనులు చేపట్టారు. ఈ అడవి పరిధి కిష్టాయపల్లి శివారులోని 25 ఎకరాల్లో అరుదైన మొక్కలు నాటారు. ప్రస్తుతం మరో 25 ఎకరాల్లో ఎస్‌ఎంఎం పాం్లటేషన్‌ కోసం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సుదీర్ఘకాలం నిర్లక్ష్యానికి గురైన అడవిలో వివిధ రకాల మొక్కలు నాటి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో కథనం.

ఇక్కడే ఎందుకంటే..

ఖాజీపల్లి అటవీ ప్రాంతం కూకట్‌పల్లి, బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్‌, చందానగర్‌తో పాటు.. పటాన్‌చెరు, జిన్నారం మండలాల్లోని పారిశ్రామికవాడలకు అనుకూలమైనది. దీంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఇటు అడవిని రక్షించుకోవడంతో పాటు పారిశ్రామికవాడల నుంచి వెలువడే వాయు కాలుష్యానికి విరుగుడు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఖాజీపల్లి పరిధిలోని కిష్టాయపల్లి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి.. అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి అడవిలో చెట్ల కంటే పిచ్చి మొక్కలే అధికంగా ఉన్నాయి. వాటిని తొలగించి.. చదును చేసి.. మొక్కలు నాటనున్నారు. వర్షాకాలంలో ఎస్‌ఎంఎం ప్లాంటేషన్‌ పేరుతో సుమారు 10 వేల మొక్కలు నాటేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అటవీ రేంజి అధికారి వీరేంద్రబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు