logo

బాలికను నమ్మించి.. మోసగించిన యువకుడు

ప్రేమ పేరుతో దగ్గరై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిసిన తర్వాత ముఖం చాటేసిన యువకుడిపై ఓ బాలిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇద్దరూ సఖ్యతగా ఉన్న సమయంలో తీసిన నగ్న వీడియోను

Published : 15 Jan 2022 03:48 IST

పొక్సో, అత్యాచారం, అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు

హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో దగ్గరై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిసిన తర్వాత ముఖం చాటేసిన యువకుడిపై ఓ బాలిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇద్దరూ సఖ్యతగా ఉన్న సమయంలో తీసిన నగ్న వీడియోను అతని వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకుని పరువు తీశాడని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలంటూ తల్లితో కలిసి అతని ఇంటి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలో గురువారం చోటుచేసుకోగా.. ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన జింకల మహేశ్‌ (19), అదే గ్రామానికి బాలిక (17) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువకుడు డిగ్రీ మొదటి ఏడాది చదువుతుండగా.. బాలిక ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఉంది. సదరు యువకుడు బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడి చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత ఉన్న సమయంలో బాలికను నగ్నంగా వీడియో కాల్‌ చేయమని చెప్పి రికార్డు చేసుకున్నాడు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. దీంతో యువకుడు ముఖం చాటేశాడు. అంతే కాకుండా నగ్న వీడియోను అతని వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టాడు. దీన్ని చూసిన గ్రామస్థులు విషయాన్ని ఆ కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో బాలికతో సహా తల్లిదండ్రులు హుజూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు అందజేశారు. యువకుడిపై పొక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐటీ చట్టాల ఉల్లంఘనపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం బాలిక, తల్లిదండ్రులు, బంధువులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కోదాడ డీఎస్పీ రఘు శుక్రవారం సాయంత్రం గ్రామంలో విచారణ చేపట్టారు.  


యువతి అనుమానాస్పద మృతి

మఠంపల్లి, న్యూస్‌టుడే: యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై ఇరుగు రవి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎస్‌కే కైరూన్‌(33)కు 15 ఏళ్ల కిందట వివాహమైంది. కాగా 2014లో భర్త అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్నారు. మృతురాలికి కొన్నేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన కరీముల్లాతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ కొంతకాలం ఆ రాష్ట్రంలోనే కలిసి నివసించారని స్థానికులు తెలిపారు. ఇద్దరి మధ్య స్పర్దలు రావడంతో కొంతకాలం కిందట కైరూన్‌ స్వగ్రామానికి వచ్చి ఉంటోంది. అప్పుడప్పుడూ ఇక్కడకు వస్తుండే కరీముల్లా ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ఉదయం కైరూన్‌తో ఘర్షణ పడడాన్ని స్థానికులు గమనించారు. అతడు వెళ్లిపోయిన తర్వాత మధ్యాహ్నం వరకు తలుపులు తీయక పోవడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు. కైరూన్‌ మృతదేహం నేలపై పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడం అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు. కరీముల్లా కనిపించక పోవడంతో అతనే హత్య చేశాడా..మృతురాలు బలవన్మరణానికి పాల్పడిందా అన్న విషయాలు విచారణలో తెలుస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని