logo

ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ఉత్సాహం పెరుగుతుందని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు

Published : 22 May 2022 03:59 IST

నృత్యం చేస్తున్న పోలీస్‌ శిక్షణ పొందుతున్న అభ్యర్థినులు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ఉత్సాహం పెరుగుతుందని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని పోలీస్‌ శాఖలో అత్యధిక కొలువులు జిల్లా నుంచి పొందాలని కోరారు. ఏఎస్పీ మనోహర్‌, ఓఎస్‌డీ అశ్వాక్‌, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి రాజ్‌కుమార్‌, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, నాగేశ్వర్‌రావు, సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.
పోలీస్‌ కుటుంబాలకు చేయూత
నల్గొండ నేరవిభాగం: జిల్లాలో పోలీస్‌ కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. డీసీఆర్‌బీలో పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్సై స్వామి భార్య వసంతకు రూ.3.98 లక్షలు, మర్రిగూడ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తూ అకాల మరణం పొందిన కానిస్టేబుల్‌ సైదులు భార్య మానసకు రూ.2 లక్షల భద్రత చెక్కులను శనివారం స్థానిక కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చనిపోయిన పోలీస్‌ కుటుంబాలకు అండగా ఉండటంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు సకాలంలో అందేలా చూస్తామన్నారు. ఏవో మంజు భార్గవి, పోలీస్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్‌, కార్యదర్శి సోమయ్య, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని