logo

ఒక నెల మంత్రి

అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన కొమ్ము పాపయ్య 1978, 1983లో అప్పటి రామన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.

Published : 27 Nov 2023 05:58 IST

కొమ్ము పాపయ్య

డ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన కొమ్ము పాపయ్య 1978, 1983లో అప్పటి రామన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అప్పట్లో ముఖ్యమంత్రి టి.అంజయ్య మంత్రివర్గంలో పాపయ్య నెల పాటు విద్యుత్తు సహాయ మంత్రిగా పనిచేశారు. 1985లోనూ మళ్లీ అక్కడి నుంచే కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి గుర్రం యాదగిరిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆయన 2017 సెప్టెంబరు 6న పరమపదించారు.    

మోత్కూరు, న్యూస్‌టుడే


ఉప ఎన్నికంత ఊపు కనిపించట్లే

మునుగోడులో గతేడాది జరిగిన ఉప ఎన్నిక ఓ యుద్ధ వాతావరణంలో సాగింది. నిత్యం వందలాది కార్లు, తెలియని రాష్ట్ర నేతలు గ్రామాలను చుట్టుముట్టి ముమ్మరంగా ప్రచారాలను నిర్వహించారు. ఆ ఎన్నికతో ఊర్లన్నీ సందడితో పాటు దుకాణాలకు మంచి గిరాకీ దొరికింది. అంతేకాకుండా ప్రచారానికి సైతం నిత్యం వందలాదిగా తీసుకెళ్లి రూ.300కు తగ్గకుండా కూలీ చెల్లించేవారు. ఎన్నికల కంటే పది రోజులు ముందు నుంచే చికెన్‌ ప్యాకెట్‌, బీరు, మద్యం సీసా ఓటరు ఇంటికి చేరుకునేది. కానీ ఈ ఎన్నిక ఇంకా నేటికి మూడు రోజులే గడువు ఉన్నప్పటికి.. ఉప ఎన్నిక అంతమజా ఈ ఎన్నికకు కనిపించడం లేదని పరేషాన్‌ అవుతున్నారు.        - మునుగోడు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని