logo

బెస్ట్‌ రిజిస్టర్‌ అధికారిగా గూడూరు ఆర్డీవో

బెస్ట్‌ రిజిస్టర్‌ అధికారిగా గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ ఎంపికైనట్లు ఎన్నికల సంఘం సీఈవో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలను సమర్థంగా నిర్వహించినందుకు బెస్ట్‌ రిజిస్టర్‌ అధికారిగా ఎంపికయ్యారు. గూడూరు ఎస్సీ నియోజకవర్గ

Published : 24 Jan 2022 06:12 IST

గూడూరుగ్రామీణం, న్యూస్‌టుడే : బెస్ట్‌ రిజిస్టర్‌ అధికారిగా గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ ఎంపికైనట్లు ఎన్నికల సంఘం సీఈవో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలను సమర్థంగా నిర్వహించినందుకు బెస్ట్‌ రిజిస్టర్‌ అధికారిగా ఎంపికయ్యారు. గూడూరు ఎస్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీ, ఫార్మ్‌6, ఫార్మ్‌ 8ల నమోదు, ఎన్నికల నిర్వహణలో ప్రతిభను గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఆయన్ని ఎంపిక చేశారు. అవార్డును 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయిలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఈ అవార్డు అందుకోనున్నట్లు ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని