logo

తెదేపాతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం జరిగింది.

Updated : 29 Mar 2024 13:07 IST

కొడవలూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే ప్రారంభమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపాను గెలిపించాలని పేర్కొన్నారు .పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి నిర్మాణం జరగాలన్న, పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, మాజీ జెడ్పీటీసీ ఇరువురు శ్రీధర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థల మాజీ ఛైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని