logo

మద్య రహిత ఎన్నికలకు కృషి

సార్వత్రిక ఎన్నికలకు ఎక్సైజ్‌, పోలీసు, రెవెన్యూ శాఖలు ప్రజల సమన్వయంతో మద్య రహిత ఎన్నికలకు కృషి చేయాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) జాయింట్‌ కమిషనర్‌ బి.అరుణ్‌రావు అధికారులను ఆదేశించారు.

Published : 16 Apr 2024 02:55 IST

సెబ్‌ జాయింట్‌ కమిషనర్‌ అరుణ్‌రావు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు ఎక్సైజ్‌, పోలీసు, రెవెన్యూ శాఖలు ప్రజల సమన్వయంతో మద్య రహిత ఎన్నికలకు కృషి చేయాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) జాయింట్‌ కమిషనర్‌ బి.అరుణ్‌రావు అధికారులను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం సెబ్‌, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళికి కట్టుబడి విధులు నిర్వహించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసుకుని పక్కా సమాచారంతో మద్యం అక్రమ రవాణా, అనధికార నిల్వలు, నాటుసారా తయారీ, విక్రయాలపై ఆకస్మిక దాడులు చేయాలన్నారు. చెక్‌పోస్టుల్లో విధులు నిర్వర్తిస్తూనే రూట్‌వాచ్‌లు సైతం నిర్వహించాలన్నారు. 2014, 2019 ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనంతరం ఆయన సెబ్‌ నెల్లూరు-1 స్టేషన్‌, మనుబోలు చెక్‌పోస్టును తనిఖీ చేశారు. సమావేశంలో సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు, అదనపు ఎస్పీ సీహెచ్‌ సౌజన్య, సెబ్‌ ఏసీ పి.దయాసాగర్‌, ఈఎస్‌ బాబు శ్రీధర్‌, ఏఈఎస్‌ జి.నరసింహరావు, జిల్లాలోని ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని