logo

2.64 లక్షల ఎకరాలకు సాగునీరు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 2.64 లక్షల ఎకరాలకు సాగునీరువిడుదల చేయనున్నారు. ఈ మేరకువివిధ ప్రాజెక్టులు, ఎత్తిపోతల ద్వారా 23.832 టీఎంసీలు కేటాయించారు. నిజాంసాగర్‌ కింద ఈ నెల 15, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఈ నెల 25 నుంచి నీటిని

Published : 05 Dec 2021 05:33 IST

యాసంగికి 23.832 టీఎంసీలు

ఆమోదం తెలిపిన సలహా బోర్డు

సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేష్‌ వి పాటిల్‌,

ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, నిజామాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు

ఈనాడు, నిజామాబాద్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 2.64 లక్షల ఎకరాలకు సాగునీరువిడుదల చేయనున్నారు. ఈ మేరకువివిధ ప్రాజెక్టులు, ఎత్తిపోతల ద్వారా 23.832 టీఎంసీలు కేటాయించారు. నిజాంసాగర్‌ కింద ఈ నెల 15, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఈ నెల 25 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి అధ్యక్షతన స్థానిక ప్రగతిభవన్‌లో శనివారం జరిగిన నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు.

నిజాంసాగర్‌ ఆయకట్టుకు ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 13 వరకు ఆరు తడులుగా నీళ్లివ్వనున్నారు. శ్రీరాంసాగర్‌ ఆయకట్టుకు ఈ నెల 25 నుంచి మే 18 వరకు నిరంతరాయంగావిడుదల చేస్తారు. అలీసాగర్‌ ఎత్తిపోతల కింద ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 18 వరకు ఆరుతడులుగా ఇవ్వనున్నారు. అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం కింద ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఏడు తడుల కింద అందిస్తారు. పోచారం ప్రాజెక్టు ద్వారా జనవరి 1 నుంచి ఏప్రిల్‌ 20 వరకు తొమ్మిది తడులుగా, కౌలాస్‌ నాలా కింద ఈ నెల 10 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఏడు తడులు, రామడుగు కింద ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 28 వరకు ఏడు తడులుగా నీటి విడుదల ఉండనుంది.

వరిసాగుపై మంత్రి విజ్ఞప్తి

ఎమ్మెల్యేలు, ఆయకట్టు రైతుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. యాసంగిలో ధాన్యం కొనే అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. రైతులు ఆలోచించి పంటలు వేయాలన్నారు. వరి సాగు చేయాల్సి వస్తే రైస్‌మిల్లర్లు, వ్యాపారులతో బైబ్యాక్‌ ఒప్పందాలు చేసుకోవాలని చెప్పారు. వానాకాలం వడ్ల కొనుగోలులో నిజామాబాద్‌ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ మోహన్‌, నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, జలవనరుల శాఖ నిజామాబాద్‌, కామారెడ్డి సీఈలు మధుసూదన్‌రావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని