logo

దళితబంధు నివేదిక రూపొందించాలి

దళితబంధు అమలుకు సంబంధించి ఈ నెల 31 వరకు సమగ్ర నివేదికలు తయారు చేసి అందించాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 28 Jan 2022 03:23 IST

సమావేశంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, శిక్షణ కలెక్టర్‌ మకరంద్‌

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: దళితబంధు అమలుకు సంబంధించి ఈ నెల 31 వరకు సమగ్ర నివేదికలు తయారు చేసి అందించాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో ఉపాధి కోరుకుంటున్నట్లు ఇటీవల క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఫర్టిలైజర్స్‌ దుకాణాలు, డెయిరీ, పౌల్ట్రీ వంటి యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. ఆయా శాఖలతోపాటు ఉద్యానశాఖ అధికారులు కూరగాయల సాగు యూనిట్ల నివేదిక తయారు చేయాలన్నారు.సమావేశంలో స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి చిత్రామిశ్రా, శిక్షణ కలెక్టర్‌ మకరంద్‌, కాకతీయ సాండ్‌ బాక్స్‌ సంస్థ సీఈవో మనీశ్‌ జైస్వాల్‌ పాల్గొన్నారు.

బాల్కొండ, జక్రాన్‌పల్లి: బాల్కొండ మండలం మీదుగా వెళ్తున్న 44వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలను జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. శ్రీరాంపూర్‌, చిట్టాపూర్‌, బాల్కొండ, కిసాన్‌నగర్‌ శివారులో మొక్కలను చూశారు. మండల పరిధిలో 3018 మొక్కలు నాటగా అందులో 400 వరకు ఎండిపోయినట్లు గుర్తించారు. వాటి స్థానంలో కొత్తవి నాటాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, చిట్టాపూర్‌ సర్పంచి వనజ, ఏపీవో ఇందిర తదితరులున్నారు. జక్రాన్‌పల్లి మండలం చాంద్‌మియాబాగ్‌ వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న హరితహారం మొక్కలను పరిశీలించారు. మూగజీవాలు మేయకుండా ట్రీగార్డులు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని