logo

ఇంటి బిల్లు రూ. 1.77 లక్షలు

ప్రతినెల రూ.వందల్లో వచ్చే విద్యుత్తు బిల్లు రూ.లక్షల్లో వస్తే ఎవరైనా నిర్ఘాంతపోతారు. అలాంటి ఘటనే నందిపేట్‌లో తాజాగా వెలుగుచూసింది.

Published : 06 Feb 2023 05:49 IST

ప్రతినెల రూ.వందల్లో వచ్చే విద్యుత్తు బిల్లు రూ.లక్షల్లో వస్తే ఎవరైనా నిర్ఘాంతపోతారు. అలాంటి ఘటనే నందిపేట్‌లో తాజాగా వెలుగుచూసింది. సయ్యద్‌ మహబూబ్‌ ఇంట్లో(ఎస్‌సీ నం: 50950 03195) జనవరిలో కేవలం 42 యూనిట్లు తిరిగింది. ఛార్జి బిల్లు రూ.1,76,720 తోపాటు కస్టమర్‌ ఛార్జి రూ.160, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1069 అన్ని కలిపి అక్షరాల రూ.1,77,970 వచ్చింది. నివ్వెరపోయిన వినియోగదారుడు ‘న్యూస్‌టుడే’కు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై ఏడీ అశోక్‌ను సంప్రదించగా.. సాంకేతిక కారణంతో ఈ తప్పిదం జరిగిందని, సిబ్బందితో సంబంధిత మీటరును తనిఖీ చేయించి సరిదిద్దారు.

న్యూస్‌టుడే, నందిపేట్‌ గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని