logo

పీడీ ప్రతిపాదన ఏదీ?

హత్య కేసులో నిందితుడు, రౌడీషీటర్‌ ఆరిఫ్‌పై పీడీ ప్రతిపాదన అటకెక్కింది. నిందితులపై పీడీ అస్త్రం ప్రయోగిస్తామని పోలీసులు ప్రకటించి నెలరోజులు గడిచింది.

Published : 07 Feb 2023 04:47 IST

జైలులోనే హత్య కేసు నిందితులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నేరవార్తలు

హత్య కేసులో నిందితుడు, రౌడీషీటర్‌ ఆరిఫ్‌పై పీడీ ప్రతిపాదన అటకెక్కింది. నిందితులపై పీడీ అస్త్రం ప్రయోగిస్తామని పోలీసులు ప్రకటించి నెలరోజులు గడిచింది. ఆ దిశగా ఇప్పటివరకు చర్యలేవీ మొదలుపెట్టలేదు. ప్రస్తుతం నిజామాబాద్‌ కారాగారంలోనే ఆరిఫ్‌తో పాటు మరికొంత మంది నిందితులు రిమాండు ఖైదీలుగా ఉన్నారు. వీరంతా బెయిలు ప్రయత్నాల్లో ఉన్నారు.

* పీడీఎస్‌ దందా నడిపే వారి నుంచి మామూళ్లు తీసుకొనే క్రమంలో ఇద్దరు రౌడీషీటర్లు ఇబ్రహీం చావుస్‌, ఆరిఫ్‌ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇదే కారణంతో ఇబ్రహీంను గత నెలలో ఆరిఫ్‌ హతమార్చాడు. ఆయనపై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఆరిఫ్‌ను కట్టడి చేసేలా చర్యలు చేపట్టాల్సి అవసరం ఉంది.

* స్థానికుల ఆందోళన..  ఒక రౌడీషీటర్‌ హత్యకు గురికాగా.. మరో రౌడీషీటర్‌ జైలులో ఉన్నాడు. నెల రోజులుగా బోధన్‌ రోడ్డు, మాలపల్లి, అర్సపల్లి శివారు ప్రాంతాల్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. పెద్దగా గొడవలు జరిగిన దాఖలాలు లేవు. తిరిగి ఆరిఫ్‌ ముఠా బయటకు వస్తే పరిస్థితులు ఎప్పటిలాగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని