logo

శుభముహూర్తాలకు సెలవు

శుభాకార్యాలకు బ్రేక్‌ పడింది. మూడాలు, ఆషాఢంతో వచ్చే మూడు నెలల పాటు శుభముహూర్తాలు లేవని వేదపండితులు చెబుతున్నారు. గతంలో వేసవిలో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరిగేవి.

Updated : 30 Apr 2024 06:46 IST

మూడు నెలల పాటు తప్పని ఎదురుచూపులు

న్యూస్‌టుడే,నిజామాబాద్‌ సాంస్కృతికం: శుభాకార్యాలకు బ్రేక్‌ పడింది. మూడాలు, ఆషాఢంతో వచ్చే మూడు నెలల పాటు శుభముహూర్తాలు లేవని వేదపండితులు చెబుతున్నారు. గతంలో వేసవిలో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరిగేవి. కానీ, ఈసారి పెళ్లిళ్లు, నూతన గృహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్ఠాపనలు, శంకుస్థాపనలకు అవకాశం లేకుండా పోయిందంటున్నారు. వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌడ్యమి ప్రభావంతో సుముహూర్తాలు ఉండవంటున్నారు. జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢంలో ఎలాగూ పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యం కాదంటున్నారు. బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాల కొనుగోళ్లు తగ్గనున్నాయి. పూలు, పండ్లు విక్రయదారులతో పాటు పూజారులు, బాజాభజంత్రీలు, మేళతాళాలు కొట్టేవారు, ఫొటోగ్రాఫర్లు తదితరులకు ఉపాధి తగ్గిపోనుంది. కల్యాణ మండపాలు ఖాళీగా ఉండనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని