Jeevan reddy: ఆర్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు అధికారుల నోటీసులు

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన మాల్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Published : 09 May 2024 15:31 IST

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన మాల్‌కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.3.14కోట్ల బకాయిలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఆర్టీసీ డీఎం ఆంజనేయులు ఈ నోటీసులు ఇచ్చారు. గురువారం సాయంత్రంలోపు బకాయిలు చెల్లించాలని.. లేకపోతే మాల్‌ను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

పట్టణంలోని బస్టాండుకు ఆనుకొని ఆర్టీసీకి చెందిన 7 వేల చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. ఇందులో కొంతకాలం కిందట జీ-1(జీవన్‌రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌) పేరిట భవన నిర్మాణం చేపట్టి దుకాణాలు, సినిమా హాళ్లు ఏర్పాటు చేశారు. ఏడాది ప్రాతిపదికన ఆర్టీసీకి అద్దె చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని