logo

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను సాధించేందుకు కృషి చేయాలని, రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు.

Updated : 27 Nov 2022 06:10 IST

బ్రహ్మపురలో బిశ్వనాథ్‌ దాస్‌  విగ్రహానికి నమస్కరిస్తున్న బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి

భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను సాధించేందుకు కృషి చేయాలని, రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. బీఆర్‌ అంబేడ్కర్‌,  స్వాతంత్య్ర సమరయోధుడు, దివంగత మాజీ సీఎం బిశ్వనాథ్‌ దాస్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.

న్యూస్‌టుడే, బృందం

రాయగడ: ఆల్‌ఇండియా ఎస్సీ, ఎస్టీ సంఘం, అంబేడ్కర్‌ యువజన సంఘాల ప్రతినిధుల ర్యాలీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని