logo

ఎన్నికల బరిలో అతివలకు అవకాశం

ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు.

Published : 29 Mar 2024 07:20 IST

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం జాజ్‌పూర్‌ నుంచి రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి ప్రణబ్‌ ప్రకాష్‌ దాస్‌, బిజద అగ్ర నేతలు టికెట్‌ కోసం ఎదురుచూస్తుండగా, అధిష్ఠానం మహిళా సంఘం అధ్యక్షురాలు సుజాతా సాహుకు అవకాశం కల్పించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రణబ్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. ్చ

దరఖాస్తు చేయకుండానే టికెట్‌: దాశరథిపూర్‌ సమితి తరపడా పంచాయతీ పెంటాబడ్‌కు చెందిన సుజాతా మా సరస్వతి స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలుగా పని చేస్తుంది. ఈ సంఘం సభ్యులు బ్యాగులు, ఫైళ్లు, పెన్సిళ్లు తయారీ, విక్రయాల్లో బాగా రాణించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సుజాతా సమితి సభ్యురాలుగా, తర్వాత సమితి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. మహిళలకు ఉపాధి కల్పించడంలో ఆమె చేస్తున్న కృషికిగాను మిషన్‌ శక్తి అధ్యక్షురాలుగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుబాయ్‌ కూడా వెళ్లారు. ఆమె మహిళల అభివృద్ధి కోసం కృషి చేయడంతో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని బిజద కల్పించింది. దరఖాస్తు పెట్టకుండా పార్టీ అధిష్ఠానం సుజాతకు అవకాశం ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రజాసేవ చేస్తానని సుజాతా విలేకరులతో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు