logo

ఇకనైనా దాహార్తి తీరేనా!

ఏళ్ల కిందట నిర్మించిన రక్షిత పథకాల మరమ్మతులు.. పెరుగుతున్న జనాభా.. వెరసి ఏడాది పొడవునా పట్టణాల్లో తాగునీటి ఇక్కట్లు సర్వసాధారణం అవుతున్నాయి.

Published : 26 May 2023 03:24 IST

ఉమ్మడి జిల్లాలకు ‘అమృత్‌’లో రూ.92 కోట్లు మంజూరు

న్యూస్‌టుడే-పాలకొండ: ఏళ్ల కిందట నిర్మించిన రక్షిత పథకాల మరమ్మతులు.. పెరుగుతున్న జనాభా.. వెరసి ఏడాది పొడవునా పట్టణాల్లో తాగునీటి ఇక్కట్లు సర్వసాధారణం అవుతున్నాయి. వేసవి వస్తే ఈ సమస్య మరింత అధికంగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారానికి అమృత్‌ పథకంలో భాగంగా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.10.38 కోట్లు, విజయనగరం జిల్లాకు రూ.81.62 కోట్లు ఇటీవల విడుదల చేసింది.

ఏయే ప్రాంతాలకు కేటాయిస్తారు

పట్టణాల్లో బలహీన, వెనుకబడిన వర్గాలు నివాసం ఉండే ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు. అవసరమైన చోట్ల రక్షిత పథకాల నిర్మాణం, పైపులైన్లు విస్తరించనున్నారు. ముందుగా వీటికి డీపీఆర్‌లు రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అనంతరం పాలకవర్గాల అనుమతితో ఏయే ప్రాంతాలకు అవసరమో గుర్తిస్తారు. అనంతరం టెండర్లు పూర్తయిన తర్వాత పనులు ప్రారంభిస్తారు.

జగనన్న కాలనీలకు ప్రాధాన్యం

ఇప్పటికే పట్టణాలకు నాన్‌ అమృత్‌ పథకంలో భాగంగా నిధులు మంజూరయ్యాయి. దీంతో ప్రస్తుతం మంజూరైన అమృత్‌ నిధులను అధికంగా జగనన్న కాలనీలకు కేటాయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విజయనగరం, రాజాం, పాలకొండకు సంబంధించి ఆయా పట్టణాల్లోని బలహీన వర్గాల ప్రాంతాల్లో నిధులు వెచ్చించనున్నారు. పాలకొండతో పాటు మిగిలిన పట్టణాలకు సంబంధించి జల జీవన్‌ మిషన్‌ పథకంలో జగనన్న లేఅవుట్లలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి.


డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం

- దక్షిణామూర్తి, ఈఈ, పబ్లిక్‌ హెల్త్‌, విజయనగరం

కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాల ప్రాంతాల్లోని తాగునీటి అవసరాలకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని