logo

పెళ్లి శుభలేఖపై సూపర్‌-6 పథకాలు

బలిజిపేట మండలానికి చెందిన యువకుడు తన వివాహ ఆహ్వాన పత్రికపై తెదేపా సూపర్‌-6 పథకాలను ముద్రించి అభిమానం చాటుకున్నాడు. నారన్నాయుడువలస గ్రామానికి చెందిన బాసాన కృష్ణారావు వివాహం మార్చి 24, ఆదివారం రాత్రి జరిగింది.

Updated : 25 Mar 2024 09:13 IST

న్యూస్‌టుడే, బలిజిపేట: బలిజిపేట మండలానికి చెందిన యువకుడు తన వివాహ ఆహ్వాన పత్రికపై తెదేపా సూపర్‌-6 పథకాలను ముద్రించి అభిమానం చాటుకున్నాడు. నారన్నాయుడువలస గ్రామానికి చెందిన బాసాన కృష్ణారావు వివాహం మార్చి 24, ఆదివారం రాత్రి జరిగింది. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన పథకాల వివరాలు కార్డు పైభాగంలో ముద్రించి బంధుమిత్రులకు అందజేశాడు. పథకాలతో పాటు ఎన్టీఆర్‌, చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌కల్యాణ్‌, బొబ్బిలి, పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాల తెదేపా అభ్యర్థులు బేబినాయన, విజయచంద్ర ఫొటోలు ముంద్రించారు. ప్రస్తుతం రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వరుడు కృష్ణారావు పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని