logo

Balineni: మళ్లీ వస్తా... ఆ ఇద్దరి సంగతీ తేలుస్తా: బాలినేని

‘సాధారణంగా నేను ఎవరి జోలికీ వెళ్లను. కక్షసాధింపులకు దూరంగా ఉంటాను. కానీ ఈసారి ఎన్నికల్లో గెలిచాక ఇద్దరిని మాత్రం వదిలిపెట్టను.

Updated : 21 Nov 2023 10:54 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘సాధారణంగా నేను ఎవరి జోలికీ వెళ్లను. కక్షసాధింపులకు దూరంగా ఉంటాను. కానీ ఈసారి ఎన్నికల్లో గెలిచాక ఇద్దరిని మాత్రం వదిలిపెట్టను. వారి సంగతి తేలుస్తా’నని హెచ్చరించారు... మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy). ఆ ఇద్దరూ ఎవరన్న ప్రశ్నకు మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఒంగోలులోని నివాసంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్రికల్లో తనపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. మండువవారిపాలెం భూముల విషయంలో తాను మేయర్‌ను తిట్టాననడం అవాస్తవమన్నారు.

ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏసీఏ వారు తెర ఏర్పాటు చేసినా... అభిమానుల కోసం కుర్చీలు, స్నాక్స్‌ వంటివి సొంత ఖర్చుతో ఏర్పాటు చేశానన్నారు. అలాంటప్పుడు తన ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించుకుంటే తప్పెలా అవుతుందని వ్యాఖ్యానించారు. ఒంగోలు భూ కుంభకోణం కేసుల్లో పోలీసు దర్యాప్తు సమగ్రంగా సాగుతోందన్నారు. తానేం చేసినా ఉక్రోషం పట్టలేక మాజీ ఎమ్మల్యే దామచర్ల జనార్దన్‌ అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ నెల 22న ఒంగోలులో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుందని... రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, విడదల రజనితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ, అద్దంకి బస్టాండ్‌ కూడలిలో సభ నిర్వహిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని