logo

ఇంత బరితెగింపు ఏమిటన్నా!

ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.

Published : 19 Apr 2024 03:24 IST

రాంబాబు

మార్కాపురం నేర విభాగం, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పర్యవేక్షణ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నామమాత్రపు అనుమతులతో ఎన్నికల అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కొన్నిసార్లు అడ్డంగా దొరికిపోయి కేసులు నమోదవుతున్నా లెక్క చేయడం లేదు. ‌్ర వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి స్వాగతం పలికేందుకు మార్కాపురం సమన్వయకర్త, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ఈ నెల 1న ఎన్నికల అధికారి నుంచి అరవై వాహనాలతో ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి పొందారు. ఆ తర్వాత అంతకుమించి ర్యాలీ నిర్వహించారు. దీంతో పాటు ద్విచక్ర వాహనదారులకు రూ.1.05 లక్షల విలువైన పెట్రోల్‌ కూపన్లు పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేశారు. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారి, ఉప కలెక్టర్‌ రాహుల్‌ మీనా ఆదేశాల మేరకు ఏఆర్‌వో, మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం అనుమతితో అన్నా రాంబాబుపై కోడ్‌ ఉల్లంఘన కింద బుధవారం రాత్రి పట్టణ ఎస్సై షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌ కేసు నమోదు చేశారు. ‌్ర ఇదే కార్యక్రమంలో అనుమతి లేకుండా పార్టీ కార్యకర్తలకు భోజనం పెట్టారనే ఫిర్యాదుపై రాంబాబు, ఆయన కుమారుడు కృష్ణచైతన్యపై ఇప్పటికే కేసు నమోదైంది. ‌్ర గత నెల 17న ముస్లిం షాదీఖానా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అన్నాతో పాటు మరో ముగ్గురు వైకాపా నాయకులపై ఇప్పటికే కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని