logo

ప్రాణం తీసిన విద్యుత్తు తీగ

ఇంటిపై ఉన్న విద్యుత్తు తీగ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నిర్మాణ పనిలో నిమగ్నమైన తాపీ మేస్త్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన మందస మండలం ఉగ్రవానిపేట (చినసువర్ణపురం)లో మంగళవారం జరిగింది.

Published : 27 Mar 2024 03:28 IST

 

హరిపురం (మందస), న్యూస్‌టుడే: ఇంటిపై ఉన్న విద్యుత్తు తీగ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నిర్మాణ పనిలో నిమగ్నమైన తాపీ మేస్త్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన మందస మండలం ఉగ్రవానిపేట (చినసువర్ణపురం)లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహాడపల్లికి చెందిన సాలిని గున్నయ్య (40) ఉగ్రవానిపేటలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారు. మంగళవారం గోడకు ప్లాస్టింగ్‌ చేస్తుండగా పైనున్న 11 కె.వి. విద్యుత్తు తీగకు తాపీ పనిలో వినియోగించే గజం బద్ద తగిలింది. వెంటనే బాధితుడు కింద పడిపోయాడు. సమాచారం తెలుసుకుని ఆసుపత్రిలో చేర్పించేందుకు 108 సిబ్బంది చేరుకున్నారు. అప్పటికే గున్నయ్య మృతి చెందినట్లు వాహన సిబ్బంది తెలిపారు. విషయం తెలిసి భార్య గంగమ్మ ఇంటివద్దనే కుప్పకూలిపోయారు. అప్పుడే పది పరీక్ష రాసి ఇంటికి చేరిన కుమార్తె దీపిక, కుమారుడు సాయి గుండలవిసేలా రోదించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. గున్నయ్యది పలాస మండలం పల్లిమాకన్నపల్లి గ్రామం. బహాడపల్లిలో స్థిరపడ్డారు. పెద్దదిక్కు మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని