logo

తెదేపాలోకి జోరుగా చేరికలు

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి.

Published : 30 Mar 2024 04:33 IST

కోటబొమ్మాళి: అచ్చెన్న సమక్షంలో పార్టీలో చేరిన రైతుపురం వైకాపా శ్రేణులు

ఆమదాలవలస పట్టణం, కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఆమదాలవలస పురపాలిక పరిధిలోని లక్ష్ముడుపేటకు చెందిన 10 కుటుంబాలు శుక్రవారం వైకాపాను వీడి తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు వేసి తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఆర్థిక సమతుల్యతతో కూడిన పాలన అందిస్తుందన్నారు. తెదేపా, భాజపా, జనసేన కూటమిని ఆదరించి రాష్ట్రంలోని అరాచక పాలన తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.  తమ్మినేని విద్యాసాగర్‌, సంపతిరావు మురళి, నూక రాజు, సనపల ఢిల్లేశ్వరావు, బొర గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ‌్ర తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో నందిగాం మండలం సైలాడ పంచాయతీ రౌతుపురానికి చెందిన 25 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలోకి చేరాయి. గ్రామానికి చెందిన వెంకటేష్‌, వెంకటమణ, కోదండ, కృష్ణారావు, చిన్నారావు, శంకరరావు తదితర కుటుంబాలు కోటబొమ్మాళి పార్టీ కార్యాలయంలో తెదేపా తీర్థం పుచ్చుకోవడంతో అచ్చెన్న వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ నందిగాం మండల అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. ‌్ర కోటబొమ్మాళి మేజర్‌ పంచాయతీకి చెందిన వైకాపా శ్రేణులు దేవాది రాజు, లచ్చయ్య తదితరులు కూడా అచ్చెన్న సమక్షంలో తెదేపాలోకి చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌, మాజీ సర్పంచి దేవాది సింహాద్రి ఉన్నారు.

తెదేపాలో చేరిన వారితో కూన రవికుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు