logo

అయిదేళ్లుగా వదిలేశారు..!

అధికార పార్టీ నాయకుల ప్రసంగాలు, వారి హామీలు నీటి మూటలనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం.

Published : 30 Mar 2024 04:35 IST

గచ్చు లేకపోవడంతో పరదాపై కూర్చున్న చిన్నారులు

ధికార పార్టీ నాయకుల ప్రసంగాలు, వారి హామీలు నీటి మూటలనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో సంతబొమ్మాళి మండలం పోతునాయుడుపేటలో తెదేపా హయాంలో అంగన్‌వాడీ కేంద్రం పనులు చేపట్టారు. శ్లాబ్‌, గోడల నిర్మాణంతో దాదాపు 70 శాతం పనులు పూర్తి చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో గుత్తేదారుకు బిల్లుల చెల్లింపులు జరగలేదు. అనంతరం వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దృష్టి పెట్టలేదు. అయిదేళ్లలో మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో మొండి గోడలు, ప్లాస్టింగ్‌ చేయని గదులు మధ్యనే గచ్చులు కూడా లేకపోవడంతో మట్టిపై చిన్న పరదా పరుచుకొని పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఇక్కట్లు పడుతూ ఆహారం తినాల్సి వస్తోంది. ఈ విషయమై కోటబొమ్మాళి ఐసీడీఎస్‌ సీడీపీవో హైమవతి మాట్లాడుతూ మిగిలిన పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. నిధులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు.  

న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

అసంపూర్తిగా అంగన్‌వాడీ కేంద్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని