logo

అభ్యర్థుల ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచే అభ్యర్థుల ఖర్చులు లెక్కించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు.

Published : 17 Apr 2024 04:37 IST

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచే అభ్యర్థుల ఖర్చులు లెక్కించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, వాహనాలు, ఏజెంట్లకు పెట్టే భోజనాలు అభ్యర్థి ఖాతాలో నమోదు చేయాలని తెలిపారు. పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులు ఇద్దరూ ఒకే చోట సమావేశాలు పెడితే ఇద్దరి ఖాతాలో నమోదు చేయాలన్నారు. జిల్లాకు ముగ్గురు ఐఆర్‌ఎస్‌ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించిందన్నారు. సమావేశం, సభలు జరిగిన 24 గంటల్లో ఖర్చులు నమోదు చేయాలన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిటర్నింగ్‌ అధికారులు సిద్ధం కావాలని చెప్పారు. పత్రాలు తీసుకోవడంలో జాగ్రత్తలు, పంపిణీ కేంద్రాలు, రోజువారీ నివేదికలు తదితర అంశాల గురించి వివరించారు. జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో ఎం.గణపతిరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు