logo

జానకీనాయక.. జగమంతా వేడుక..

ఊరూరా పందిళ్లు.. వాడవాడలా వేడుకలతో సిక్కోలులో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బుధవారం జిల్లావ్యాప్తంగా శ్రీరామ నవమి సందడి నెలకొంది. రామమందిరాలు, ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

Published : 18 Apr 2024 05:58 IST

 బలగ కాలభైరవాలయంలో సీతారాముల కల్యాణం తిలకిస్తున్న భక్తులు
ఊరూరా పందిళ్లు.. వాడవాడలా వేడుకలతో సిక్కోలులో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బుధవారం జిల్లావ్యాప్తంగా శ్రీరామ నవమి సందడి నెలకొంది. రామమందిరాలు, ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళ ధ్వనుల నడుమ కనులపండువగా సీతారాములకు కల్యాణం జరిపించారు. పలు చోట్ల సాంస్కృతిక ప్రదర్శనలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 - న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని