logo

విద్యుత్‌ రేసింగ్‌ కారు తయారీ

మొదటి విద్యుత్‌ రేసింగ్‌ కారును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -మద్రాస్‌ (ఐఐటీ ఎం) ‘రఫ్తర్‌ ఫార్ములా రేసింగ్‌ టీం’ తయారు చేసింది.

Published : 29 Nov 2022 00:28 IST

ప్రత్యేకత చాటిన ఐఐటీఎం బృందం

కారు నడుపుతున్న దృశ్యం

వడపళని, న్యూస్‌టుడే: మొదటి విద్యుత్‌ రేసింగ్‌ కారును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -మద్రాస్‌ (ఐఐటీ ఎం) ‘రఫ్తర్‌ ఫార్ములా రేసింగ్‌ టీం’ తయారు చేసింది. సోమవారం ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో ఈ కారును విద్యార్థి బృందం ప్రదర్శించింది. ‘ఆర్‌ఎఫ్‌ఆర్‌ 23’ పేరుతో బృందం ఏడాది పాటు శ్రమించి ప్రపంచ వ్యాప్తంగా ‘బెస్ట్‌ ఫార్ములా స్టూడెంట్స్‌ టీం’గా గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించింది. పలు విభాగాలకు చెందిన 45 మంది విద్యార్థులు చేతులు కలిపారు. ఈ బృందాన్ని ఐఐటీ డైరెక్టర్‌ వి.కామకోటి అభినందించారు. కోయంబత్తూరులో జనవరిలో జరగనున్న ‘ఫార్ములా భారత్‌’ కార్యక్రమానికి ఈ బృందం హాజరు కానుందని ఆయన చెప్పారు. ఫ్యాకల్టీ అడ్వైజర్‌ సత్యనారాయణన్‌ శేషాద్రి విద్యార్థుల పనితీరును ప్రశంసించారు. భవిష్యత్తు పరిశోధనలకు ఇది వేదికగా ఉంటుందన్నారు. బృంద విద్యార్థి కెప్టెన్‌ కార్తిక్‌ కారు మంచి, గౌరిక బిందల్‌ తయారు చేసిన విధానాన్ని వివరించారు.

విద్యార్థుల బృందంతో డైరెక్టర్‌ కామకోటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని