logo

విదేశాలకు బాలికల అసభ్యకర వీడియోలు

మైనర్ల అసభ్యకర వీడియోలు విదేశాలకు పంపుతున్న తిరుచ్చికి చెందిన వ్యక్తి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

Published : 02 Dec 2022 00:03 IST

తిరుచ్చిలో నిందితుడి ఇంట్లో సీబీఐ సోదాలు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: మైనర్ల అసభ్యకర వీడియోలు విదేశాలకు పంపుతున్న తిరుచ్చికి చెందిన వ్యక్తి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అధికారుల కథనం మేరకు....తిరుచ్చి జిల్లా మణప్పారైలోని పూమాలైపట్టి ప్రాంతానికి చెందిన రాజా పదేళ్ల క్రితం లండన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం తిరుప్పూర్‌లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దిల్లీ నుంచి ఆరుగురు సీబీఐ అధికారులు మణప్పారై పోలీసుల సాయంతో తిరుచ్చి జిల్లా ప్రధానకోర్టు అనుమతితో రాజా ఇంట్లో గురువారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఈ వీడియోలు అతడికి ఎక్కడికి నుంచి వస్తున్నాయి? ఎందుకు పంపుతున్నాడు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని