logo

రామనాథ స్వామి సేవలో జపాన్‌ భక్తులు

జపాన్‌కు చెందిన హిందూ సమయం భక్తుడు మసాా(60) మెడికల్‌ సైన్సులో డిగ్రీ పొందాడు. గత 20 ఏళ్లుగా హిందూ మతం, హిందూ దైవాల గురించి ప్రచారం చేస్తున్నారు.

Updated : 08 Jun 2023 06:51 IST

దర్శనం చేసుకొంటున్న విదేశీయులు

వేలచ్చేరి, న్యూస్‌టుడే: జపాన్‌కు చెందిన హిందూ సమయం భక్తుడు మసాహి(60) మెడికల్‌ సైన్సులో డిగ్రీ పొందాడు. గత 20 ఏళ్లుగా హిందూ మతం, హిందూ దైవాల గురించి ప్రచారం చేస్తున్నారు. మసాహి నేతృతంలో 18 మంది మహిళలతో సహా 37 మంది జపాన్‌ దేశస్థులు తమిళనాడులోని అనేక ఆలయాలను దర్శిస్తున్నారు. బుధవారం రామనాధపురం జిల్లా రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని జపాన్‌ భక్తులు ఆలయంలోని తీర్థాల్లో స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో సెంగోల్‌ను చేత పట్టుకొని స్వామి సన్నిధిని ప్రదక్షిణగా చుట్టి వచ్చారు. ఆలయ పూజారులు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మసాహి మాట్లాడుతూ, దేవుడు ఒక్కడే అనేది మా నమ్మకం. కాని దేవుళ్ల పేర్లు, పూజా పద్ధతులు వేరైనప్పటికీ భారత దేశంలో దైవ భక్తి ఎక్కువ అని నమ్ముతున్నాము. ఈ కారణంగా తాను గత 20 ఏళ్లుగా రామేశ్వరంలో గల రామనాథస్వామి ఆలయానికి వచ్చిన అనుభవం ఉందని  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని