logo

ప్రతి ముగ్గురిలో ఒక్కరికి కోవిడ్

నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. 229 రోజుల తర్వాత గరిష్ఠ స్థాయిలో శుక్రవారం కేసులు నమోదయ్యాయి. గతేడాది మే 30న 1,035 కేసులు వచ్చాయి. గురువారంతో పోల్చితే కేసులు ఒక మాదిరిగా పెరిగాయి.

Published : 15 Jan 2022 05:13 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. 229 రోజుల తర్వాత గరిష్ఠ స్థాయిలో శుక్రవారం కేసులు నమోదయ్యాయి. గతేడాది మే 30న 1,035 కేసులు వచ్చాయి. గురువారంతో పోల్చితే కేసులు ఒక మాదిరిగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3045 మందికి పరీక్షలు చేయగా 992 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాజిటివిటీ రేటు ఏకంగా 32.58 శాతానికి పెరిగింది. పరీక్షలు చేయించుకున్న ప్రతీ ముగ్గురిలో ఒకరికి కొవిడ్‌ నిర్దరణ అవుతోంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆసుపత్రుల్లో 37 మంది ఐసీయూలో, 86 మంది ఆక్సిజన్‌ పడకలపై చికిత్స తీసుకుంటున్నారు. కొత్తగా వస్తున్న కేసుల్లో అత్యధికశాతం మందికి స్వల్ప లక్షణాలు ఉంటున్నాయి. ఇళ్ల వద్ద 3,535 మంది చికిత్స పొందుతున్నారు.

కలెక్టరేట్‌లో కలకలం: కలెక్టరేట్‌లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు, అధికారులు కొవిడ్‌ బారిన పడ్డారు. కలెక్టర్‌ సహాయ సిబ్బందికి కరోనా నిర్దరణ కావడంతో వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న కలెక్టరేట్‌లో జరగనున్న స్పందన కార్యక్రమం నిర్వహణపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.


నిబంధనలు పాటించడం మరవొద్దు: సీపీ

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: కొవిడ్‌ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు విధిగా పాటించాలని నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా ఒక ప్రకటనలో కోరారు. విధిగా మాస్క్‌ను ధరించాలన్నారు. నగరవాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.


ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య: 1,58,514

చికిత్స పొందుతున్న వారు: 3658

మొత్తం మృతులు: 1,112

ఒకేరోజు 992 మందికి కరోనా

32.58 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు

బాధితుల సంఖ్య: 1,63,284

శుక్రవారం కోలుకున్నవారు: 80

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని