logo

ఇగ్నోలో సామాజిక బాధ్యతపై కోర్సు

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌)పై ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) కొత్తగా స్నాతకోత్తర కోర్సును రూపొందించినట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ జి.ధర్మారావు తెలిపారు.

Published : 18 Jan 2022 05:47 IST

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌)పై ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) కొత్తగా స్నాతకోత్తర కోర్సును రూపొందించినట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ జి.ధర్మారావు తెలిపారు. దూర విద్యావిధానంలో ఈ కోర్సు ఈ నెల నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్‌ వృత్తి నిపుణులతో పాటు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతను ఒక వృత్తిగా మలుచుకోవాలనుకునే విశ్వవిద్యాలయ పట్టభద్రులకు ఈ కోర్సు చాలా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని