logo

విద్యార్థి నిజాయతీ

తనకు దొరికిన పర్సును పోలీసులకు అప్పగించి విద్యార్థి నిజాయతీ చాటుకున్నాడు. పట్టణ ఎస్సై ధనుంజయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన కొణతాల యశోవర్ధన్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. ఈనెల 16వ తేదీన ఈయనకు పర్సు దొరికింది.

Published : 19 Jan 2022 05:11 IST

పర్సును ఎస్సైకి అప్పగిస్తున్న యశోవర్ధన్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తనకు దొరికిన పర్సును పోలీసులకు అప్పగించి విద్యార్థి నిజాయతీ చాటుకున్నాడు. పట్టణ ఎస్సై ధనుంజయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన కొణతాల యశోవర్ధన్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. ఈనెల 16వ తేదీన ఈయనకు పర్సు దొరికింది. అందులో రూ.6,500 నగదు, నాలుగు ఏటీఎం కార్డులు, ఆధార్‌, పాన్‌కార్డులు ఉన్నాయి. ఈ పర్సును ఆయన పోలీసులకు అప్పగించారు. అందులోని వివరాల ప్రకారం పర్సు వి.మాడుగులకు చెందిన బి. జగదీష్‌దిగా గుర్తించి పోలీసులు ఆయనకు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని పట్టణ సీఐ భాస్కరరావు, ఎస్సై ధనుంజయ్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని