logo

సంక్షిప్త వార్తలు

కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, కార్మిక, ఉపాధి కల్పన శాఖల సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి శుక్రవారం విశాఖ రానున్నారు. దిల్లీ నుంచి ఉదయం 7.30గంటలకు విమానంలో ఇక్కడికి చేరుకుంటారు

Updated : 21 Jan 2022 04:46 IST

నేడు కేంద్రమంత్రి రాక

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, కార్మిక, ఉపాధి కల్పన శాఖల సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి శుక్రవారం విశాఖ రానున్నారు. దిల్లీ నుంచి ఉదయం 7.30గంటలకు విమానంలో ఇక్కడికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణానికి చేరుకొని ఐఐపీఈ తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు.


విధుల్లోకి కమిషనర్‌ లక్ష్మీశ

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ గురువారం విధులకు హాజరయ్యారు. ఈనెల 8 నుంచి ఆయన అనా రోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి విధులకు హాజరయ్యారు. ప్రధాన కార్యాలయంలో మేయరు గొలగాని హరి వెంకట కుమారిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు.


నేటి నుంచి ములాఖత్‌లు రద్దు

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కారాగారంలో శుక్రవారం నుంచి ములాఖత్‌లు నిలిపివేస్తున్నట్లు ఐజీ డాక్టర్‌ ఇండ్ల శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టెలిఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అంశం నిబంధనలనకు  అనుగుణంగా కొనసాగనుందని ఆయన వివరించారు.


జిల్లాలో ఐదు కొవిడ్‌ కేర్‌ కేంద్రాల ఏర్పాటు

సీతంపేట, న్యూస్‌టుడే: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ప్రజలకు సేవలు అందించేందుకు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఐదు కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను నెలకొల్పి, వీటికి నోడల్‌, ఇన్‌ఛార్జి అధికారులను నియమించారు. విశాఖ అర్బన్‌, రూరల్‌, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరులో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఎంఎండ్‌హెచ్‌వో ఓ ప్రకటనలో తెలిపారు. జీవీఎంసీ ఆర్‌ఎఫ్‌వో, విశాఖ ఆర్టీవో, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు, పాడేరు ఐటీడీఏ పీవోలను నోడల్‌ అధికారులుగా, ఆయా మండలాల తహసీల్దార్లను ఇన్‌ఛార్జిలుగా నియమించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని