logo

ఆగని పరుగు.. గెలిచే వరకు..

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని అటవీశాఖాధికారి బిర్లంగి రామనరేష్‌ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన క్రీడాభారతి, నెహ్రూ యువకేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చోడవరంలో

Published : 24 Jan 2022 01:38 IST

పోటీలో పరుగుతీస్తున్న బాలికలు

చోడవరం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని అటవీశాఖాధికారి బిర్లంగి రామనరేష్‌ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన క్రీడాభారతి, నెహ్రూ యువకేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చోడవరంలో జిల్లాస్థాయి ఆటల పోటీలను నిర్వహించారు. స్థానిక గణేష్‌ డిఫెస అకాడమీ సారథ్యంలో జరిగిన ఈ ఆటల పోటీలను రామనరేష్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం సీనియర్లు, జూనియర్లకు పరుగు, షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌ తదితర పోటీలను నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా సమన్వయకర్త గొర్లె మహేశ్వరరావు మాట్లాడుతూ విజేతలకు గణతంత్ర దినోత్సవం నాడు బహుమతులను అందజేస్తామన్నారు. అంతకుముందు నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గణేష్‌ డిఫెన్స్‌ అకాడమీ సంచాలకుడు పుల్లేటి గణేష్‌, ఆర్‌ సీఈఓ ప్రసాద్‌, ప్రేమసమాజం మేనేజరు ప్రసాదురాజు, హరికృష్ణరెడ్డి, సింహాచలం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని