logo

నకిలీ తుపాకులు చూపించి.. బలవంతపు వసూళ్లు

నకిలీ తుపాకులు, కత్తిని చూపించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు రౌడీషీటర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆనందపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా

Published : 23 May 2022 05:16 IST

పరారీలో ఉన్న ఇద్దరు రౌడీ షీటర్ల అరెస్టు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : నకిలీ తుపాకులు, కత్తిని చూపించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు రౌడీషీటర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆనందపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు చెందిన దోని సతీష్‌ అలియాస్‌ గసగసాలు(24), పెదజాలారిపేటకు చెందిన పి.గౌరీసాయి(24)లు రౌడీషీటర్లు. కొంతకాలంగా వీరు పరారీలో ఉన్నారు. వీరు గంజాయి వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆనందపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారికి సహాయకులుగా ఉన్న ఒన్‌టౌన్‌కు చెందిన కె.శివ, వాసవానిపాలెంకు చెందిన వి.శ్రీను, కేరళకు చెందిన ఇబ్రహీంలను అదుపులోకి తీసుకుని వీరి నుంచి 25 కిలోల గంజాయిని, ఒక ఆటో, ఆరు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సతీష్, గౌరీ సాయిలు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు. వీరు నకిలీ తుపాకులు, కత్తులను ఉపయోగించి, పలువురి నుంచి బలవంతంగా ద్విచక్రవాహనాలను లాక్కొని, వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి నుంచి ఆరు ద్విచక్రవాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌ గతంలో పీడీ యాక్ట్‌ కింద అరెస్టై ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని