logo

అత్తపై హత్యాయత్నం.. అల్లుడికి మూడేళ్ల జైలు

అత్తపై హత్యాయత్నానికి పాల్పడిన అల్లుడికి మూడేళ్లు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమినా విధిస్తూ స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.అరుణశ్రీ గురువారం తీర్పు వెల్లడించారు. సీనియర్‌ సివిల్‌ కోర్టు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వేచలపు వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం... చోడవరం పట్టణంలోని దుడ్డువీధిలో కొమ్మోజు రాజేశ్వరరావు విశాఖపట్నంలో కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. చోడవరానికి చెందిన అరుణతో అతడికి వివాహమైంది. భార్యను తరచూ వేధిస్తుండేవాడు. దీనిపై అత్త అ

Published : 24 Jun 2022 04:55 IST

చోడవరం, న్యూస్‌టుడే: అత్తపై హత్యాయత్నానికి పాల్పడిన అల్లుడికి మూడేళ్లు జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమినా విధిస్తూ స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.అరుణశ్రీ గురువారం తీర్పు వెల్లడించారు. సీనియర్‌ సివిల్‌ కోర్టు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వేచలపు వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం... చోడవరం పట్టణంలోని దుడ్డువీధిలో కొమ్మోజు రాజేశ్వరరావు విశాఖపట్నంలో కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. చోడవరానికి చెందిన అరుణతో అతడికి వివాహమైంది. భార్యను తరచూ వేధిస్తుండేవాడు. దీనిపై అత్త అనుపోజు అమ్మాజీ అతడిని నిలదీసేది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న రాజేశ్వరరావు తనకు ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం వచ్చిందని, వైద్యుని ధ్రువపత్రం గురించి మాట్లాడాలంటూ అత్త అమ్మాజీని ఇంటికి పిలిచాడు. ఇంటికొచ్చిన ఆమెను బంధించి చావబాదాడు. అంతటితో ఊరుకోకుండా కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి రక్షించారు. 2017లో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి అదనపు ఎస్సై కరణం ఈశ్వరరావు కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసు విచారణలో సాక్ష్యాలు రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడిందని ఏపీపీ వెంకటరావు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని