logo

సింగపూర్‌ తెలుగు నారీ ‘నిషిత’

సింగపూర్‌లో తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఈనెల 13న నిర్వహించిన ‘శ్రీమతి సింగపూర్‌ తెలుగు నారీ-2022’ పోటీల్లో గాజువాకకు చెందిన కూచిపూడి నాట్యగురువు నిషిత యాబాజీకి మొదటిస్థానం దక్కింది. తుది పోటీలకు పది మంది మహిళలు ఎంపికవ్వగా,

Published : 18 Aug 2022 04:40 IST

నిషితకు జ్ఞాపిక అందజేస్తున్న పర్యటక శాఖా మంత్రి రోజా, సినీగాయని సునీత

గాజువాక, న్యూస్‌టుడే : సింగపూర్‌లో తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఈనెల 13న నిర్వహించిన ‘శ్రీమతి సింగపూర్‌ తెలుగు నారీ-2022’ పోటీల్లో గాజువాకకు చెందిన కూచిపూడి నాట్యగురువు నిషిత యాబాజీకి మొదటిస్థానం దక్కింది. తుది పోటీలకు పది మంది మహిళలు ఎంపికవ్వగా, మొదటి స్థానం సాధించిన నిషిత ‘తెలుగు నారీ కిరీటం’ సొంతం చేసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా, సినీగాయని సునీత చేతుల మీదుగా నిషితకు కిరీటం, జ్ఞాపిక అందించారు. గాజువాకలో నివాసం ఉంటున్న ఉక్కు ఉద్యోగి కోమల నారాయణరావు కుమార్తె నిషిత స్థానికంగా మాతృశ్రీ సాయి కూచిపూడి డాన్స్‌ సంస్థను స్థాపించి పలువురికి శిక్షణ ఇస్తూ నాట్య గురువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సింగపూర్‌లో యుగేష్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇప్పటికే దేశ, విదేశాల్లో పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డులు పొందారని కేంద్ర నిర్వాహకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని