logo

‘విశాఖలో కబ్జాలు తప్ప అభివృద్ధి శూన్యం’

విశాఖ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ఏం చేసిందని రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్‌.నరసింహారావు ప్రశ్నించారు. విశాఖ లాసన్స్‌బేకాలనీ భాజపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

Published : 01 Oct 2022 03:47 IST

మాట్లాడుతున్న ఎంపీ జి.వి.ఎల్‌.నరసింహారావు, పక్కన విష్ణుకుమార్‌ రాజు, దిలీప్‌వర్మ

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: విశాఖ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ఏం చేసిందని రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్‌.నరసింహారావు ప్రశ్నించారు. విశాఖ లాసన్స్‌బేకాలనీ భాజపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. భూ కబ్జాలు తప్ప మరేమైనా చేశారా మీరంటూ దుయ్యబట్టారు. ఈ ప్రాంతాన్ని కూడా తన కబ్జాలోకి తెచ్చుకోవాలని ఆలోచన తప్ప అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. విశాఖ పర్యాటక కేంద్రమైనా టూరిజం పడుకుందని అన్నారు. రుషికొండ రిసార్ట్‌ రహస్యం ఏమిటని.. అక్కడ ఏం కడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు సరే.. ప్రజల భూములు నిషేధిత జాబితాలో పెట్టి అమ్మకాలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెదేపా, వైకాపా రెండు పార్టీలకూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన లేదన్నారు. ఐటీ, డిఫెన్స్‌, పెట్రోలియం, టూరిజం, ఇండస్ట్రీస్‌, విద్య లాంటి అన్నిరంగాల్లో అభివృద్ధికి విశాఖలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. నాడు బాబు, నేడు మీరు పేదలకు ఇళ్లు చూపించి ఆడుకుంటున్నారని ఆరోపించారు.  భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్‌వర్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని