logo

‘ప్రభుత్వ భూమిని పరిరక్షించండి’

జీవీఎంసీ 89వ వార్డు ఖారవేలనగర్‌ సమీప ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని వార్డు పరిధి శ్రీదుర్గానగర్‌, ఖారవేలనగర్‌కు చెందిన నివాసితులు కోరారు. ఈ మేరకు వారు శనివారం జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారి శ్రీనివాసశాస్త్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

Published : 02 Oct 2022 04:46 IST

జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారి శ్రీనివాసశాస్త్రికి వినతిపత్రం అందజేస్తున్న  దృశ్యం

గోపాలపట్నం, న్యూస్‌టుడే : జీవీఎంసీ 89వ వార్డు ఖారవేలనగర్‌ సమీప ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని వార్డు పరిధి శ్రీదుర్గానగర్‌, ఖారవేలనగర్‌కు చెందిన నివాసితులు కోరారు. ఈ మేరకు వారు శనివారం జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారి శ్రీనివాసశాస్త్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కొందరు స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ భూమిని కాజేయాలని సర్వే నంబర్లు మార్చుతున్నారని, తరచూ సర్వేలు చేయిస్తూ నివాసితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విన్నవించారు. కొంతమంది జిల్లాస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారుల అండదండలతోనే స్థిరాస్తి వ్యాపారులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని... పూర్తిస్థాయి విచారణ చేయించి ప్రభుత్వభూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని