logo

కడితే.. కూల్చేస్తాం

వేపగుంటలోని ఓ టింబర్‌ డిపోలో నిర్మిస్తున్న భారీ షెడ్‌ పనులను సింహాచలం దేవస్థానం భూ పరిరక్షణ దళం అధికారులు, సిబ్బంది సోమవారం అడ్డుకున్నారు.

Published : 29 Nov 2022 03:29 IST

నిర్మాణాలను అడ్డుకున్న ‘సింహాచలం’ అధికారులు

నిర్మాణ సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్న దేవస్థానం సిబ్బంది..

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంటలోని ఓ టింబర్‌ డిపోలో నిర్మిస్తున్న భారీ షెడ్‌ పనులను సింహాచలం దేవస్థానం భూ పరిరక్షణ దళం అధికారులు, సిబ్బంది సోమవారం అడ్డుకున్నారు. దీంతో నిర్మాణదారుడికి, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు షెడ్డు నిర్మాణానికి తెచ్చిన సామగ్రిని దేవస్థానం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పనులు చేపడితే కూల్చేస్తామని హెచ్చరించారు. ఏఈవో ఆనంద్‌కుమార్‌, సర్వేయర్‌, సుమారు 20 మంది గార్డులు సంఘటనా స్థలికి చేరుకుని పనులను పరిశీలించారు. సింహాచలం ఆలయ భూముల్లో అనధికార కట్టడాలపై పరిశీలన చేయకుండా ఏమీ చేస్తున్నారని సెక్యూరిటీ గార్డులను ఏఈవో ప్రశ్నించారు. ఎటువంటి పనులు చేయవద్దని చెబుతున్నా రాత్రి వేళల్లో నిర్మాణం చేసేస్తున్నారని వారు సమాధానం ఇచ్చారు. తమ సొంత స్థలంలోనే షెడ్డు కడుతున్నామని ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని డిపోలో పనిచేస్తున్న వినోద్‌ అనే వ్యక్తి అధికారులను ప్రశ్నించారు. న్యాయస్థానం నుంచి అనుమతులు తెచ్చుకుని ఆ పత్రాలను దేవస్థానం కార్యాలయంలో అందజేసినప్పటికీ అడ్డంకులు ఎలా పెడతారని నిలదీయగా తమకు  ఎటువంటి పత్రాలు అందలేదని ఏఈవో బదులిచ్చారు.

పనులను అడ్డుకుంటున్న దేవస్థానం అధికారులు, సిబ్బంది

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు