logo

లోయలోకి దూసుకెళ్లిన కారు

భద్రాచలం దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఓ కారు మారేడుమిల్లి-చింతూరు ఘాట్రోడ్డులో ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 01 Feb 2023 05:25 IST

ముగ్గురికి తీవ్రగాయాలు

ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యం

మారేడుమిల్లి, చింతూరు, న్యూస్‌టుడే: భద్రాచలం దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఓ కారు మారేడుమిల్లి-చింతూరు ఘాట్రోడ్డులో ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు చెట్టుకు ఆనుకుని ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నానికి చెందిన ముగ్గురు సోమవారం భద్రాచలంలోని సీతారాముల దర్శనానికి కారులో వెళ్లారు. మంగళవారం దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమై మారేడుమిల్లి- చింతూరు ఘాట్రోడ్డులోని చైనావాల్‌ సమీపాన ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో  అదుపుతప్పి, లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వి.శ్రీనివాస్‌, వి.అనూష, వై.నాగబాబు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అటుగా వస్తున్న వాహనదారులు గమనించి, హుటాహుటిన మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. పీహెచ్‌సీ వైద్యుడు హరికృష్ణ వైద్య సేవలను అందించి, మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్సులో రంపచోడవరం తరలించారు. దీనిపై మారేడుమిల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని