logo

ముడిసరకు తెచ్చుకోండి.. స్టీలు తీసుకువెళ్లండి

విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వకపోగా, అనుకున్నట్టే ప్రైవేటీకరణకు కొత్తదారి ఎంచుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) నుంచి ‘స్టీలు సరఫరా వ్యాపార ప్రతిపాదన’ కొత్తగా తెరపైకి తెచ్చారు.

Published : 28 Mar 2023 04:18 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కొత్తదారి
తాజా నిర్ణయంపై కార్మిక సంఘాల ఆందోళన

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వకపోగా, అనుకున్నట్టే ప్రైవేటీకరణకు కొత్తదారి ఎంచుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) నుంచి ‘స్టీలు సరఫరా వ్యాపార ప్రతిపాదన’ కొత్తగా తెరపైకి తెచ్చారు. ఆసక్తి ఉన్న కంపెనీలు బొగ్గు, ఐరన్‌ ఓర్‌ వంటి ముడిసరకు తెచ్చుకుంటే, ఉక్కు తీసుకువెళ్లేలా భాగస్వామ్యం కావటానికి ఆహ్వానం పలుకుతూ సోమవారం ప్రకటన జారీచేశారు. ఆసక్తి ఉన్న కంపెనీలు ఏప్రిల్‌ 15లోగా వివరాలు తెలియజేస్తూ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌(ఈఓఐ) సమర్పించాలన్నారు. దీనిని కొరియర్‌, స్పీడ్‌ పోస్టు, రిజిస్టర్‌ పోస్టు, ఈ-మెయిల్‌ ద్వారా పంపించేలా అవకాశం కల్పించారు. భాగస్వామ్యం కావాలనుకుంటున్న కంపెనీలు ఉక్కు ముడిపదార్థాల వ్యాపారంలో ఉండి ఉండాలన్న నిబంధన పెట్టారు. అయితే టన్నుకు ఎంత ధర తీసుకుంటారో పేర్కొనలేదు. ‘ముడిసరకు తెచ్చుకోండి- స్టీలు తీసుకెళ్లండి’ అనే కొత్త నినాదంలా కేంద్రం అడుగులు వేయడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సోమవారం దిల్లీలో స్టీల్‌ కన్సెటేటీవ్‌ సభ్యులను, స్థాయి సంఘ సభ్యులను, అఖిల పక్ష కార్మిక సంఘాలు కలిసి ఉక్కును ప్రైవేటీకరించొద్దని మొరపెట్టుకున్నరోజే ఇలా ప్రకటన జారీ కావడం చర్చనీయాంశమయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని