logo

‘బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేర్చొద్దు’

రాష్ట్రంలో 40 లక్షలకు పైబడి ఉన్న బోయ వాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీల్లో చేర్చాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరికాదని గిరిజన సంఘం ఐదో షెడ్యూల్డ్‌ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి

Published : 30 Mar 2023 04:33 IST

నినాదాలు చేస్తున్న గిరిజనులు

మాడుగుల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 40 లక్షలకు పైబడి ఉన్న బోయ వాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీల్లో చేర్చాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరికాదని గిరిజన సంఘం ఐదో షెడ్యూల్డ్‌ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట నరసింహమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఎం.గదబూరులో గిరిజనులతో కలిసి నిరసన తెలిపారు. నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్డ్లో చేరుస్తామని చెప్పి ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎటువంటి ప్రభుత్వ పథకాలకు నోచుకోని ఆదివాసీలకు అన్యాయం చేసే చర్యలు విరమించుకోవాలని నినాదాలు చేశారు.  ఎర్రయ్యమ్మ, సోమునాయుడు, ఆదినారాయణ, భూలోకమ్మ, దేముడమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని