నేడు రేషన్ పంపిణీ లేనట్టే..!
రేషను సరకుల పంపిణీ ఏప్రిల్ 1వ తేదీ శనివారం నుంచి ప్రారంభయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
సమ్మెలోకి ఎండీయూ ఆపరేటర్లు
వన్‌టౌన్, న్యూస్‌టుడే: రేషను సరకుల పంపిణీ ఏప్రిల్ 1వ తేదీ శనివారం నుంచి ప్రారంభయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ హమాలీలు ఆందోళనకు దిగగా.. తాజాగా ఎండీయూ (మల్టీ డిస్పెన్సరీ యూనిట్) ఆపరేటర్లు సమ్మెకు దిగారు. దీంతో సరకుల పంపిణీపై సందిగ్ధత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 640 రేషను డిపోలున్నాయి. 310 ఎండీయూ ఆపరేటర్లు ఉన్నారు. వీరి ద్వారా 5.20లక్షల కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కిలో రూ.67 చొప్పున కందిపప్పు, కిలో రూ.16 చొప్పున రెండు కిలోల గోధుమపిండి, రూ.13.50 చొప్పున అర కిలో పంచదార సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా 1 నుంచి 20 వరకు తేదీ వరకు సరకుల పంపిణీ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ఎండీయూ ఆపరేటర్లు అనూహ్యంగా శుక్రవారం జిల్లా సంయుక్త కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్, డీఏస్‌ఓ సూర్యప్రకాశరావులకు సమ్మె నోటీసులు అందజేశారు.
బీమా పన్ను తగ్గించాలని డిమాండ్
ప్రతి ఏడాది ఎండీయూ వాహనాలకు బీమా పన్ను మార్చి నెలలో జమ చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి నడుస్తున్న ఎండీయూ వాహనాలను బీమా సంస్థలు ఏప్రిల్ నుంచి వాణిజ్య వాహనాలుగా పరిగణిస్తున్నాయి. ఈ కారణంగా బీమా మొత్తం రూ. 10 వేల నుంచి రూ.19వేలకు పెరిగిపోయింది. అంత మొత్తం తాము భరించలేమని ఆపరేటర్లు వాపోతున్నారు. ఇదే విషయాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు నివేదించారు. ఆశాఖ ఉన్నతాధికారులు బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీమా లేకుండా వాహనాలను నడపడం ఇబ్బందికరమని భావించిన ఎండీయూ ఆపరేటర్లు సమ్మెలోకి వెళ్లారు. కొద్దిరోజుల నుంచి నలుగుతున్న హమాలీల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రెండు నెలల కూలీ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించినప్పటికీ ఇంత వరకు ఆయా నిధులు హమాలీల ఖాతాలకు జమ కాలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం