logo

కోడ్‌ ఉల్లంఘించిన వాలంటీర్లపై చర్యలు

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 17 Apr 2024 04:21 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 18వ తేదీ నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై 25 వరకు కొనసాగుతుందన్నారు. సీ-విజిల్‌ యాప్‌నకు ఇంత వరకు 361 ఫిర్యాదులు రాగా, వీటిలో 266 నిర్ణీత వ్యవధిలో పరిష్కరించామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి 55 మంది వాలంటీర్లు, ఏడుగురు ఒప్పంద ఉద్యోగులు, నలుగురు పొరుగు సేవల ఉద్యోగులు, మరో ఇద్దరు రెగ్యులర్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామన్నారు. వీరిలో 28 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిబంధనలు అతిక్రమించిన అంశాలపై 58 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు చెప్పారు. రాజకీయ పార్టీలపై ఇప్పటి వరకు 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో వైకాపా-7, తెదేపా-6, జనసేన-4, ఇతరులు-13 చొప్పున ఉన్నాయని తెలిపారు. ః సువిధ యాప్‌ ద్వారా అనుమతులు కోసం 207 దరఖాస్తులు రాగా, వాటిలో 129కి ఆమోదం తెలిపామన్నారు. 65 దరఖాస్తులను తిరస్కరించామని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని కలెక్టర్‌ వివరించారు. ఏప్రిల్‌ 16వ తేదీ నాటికి జిల్లాలో ఓటర్ల సంఖ్య 20,00,290కు చేరిందన్నారు. తాజాగా 14,684 ఎపిక్‌ కార్డులు రాగా పంపిణీ చేపట్టినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు