logo

స్థానికులకే ఉపాధి కల్పిస్తాం: సీఎం రమేశ్‌

కొండకర్ల ఆవను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు మత్స్యకార యువతకు ఉపాధి కల్పిస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ హామీ ఇచ్చారు.

Published : 09 May 2024 04:04 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: కొండకర్ల ఆవను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు మత్స్యకార యువతకు ఉపాధి కల్పిస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ హామీ ఇచ్చారు. అసోంకు చెందిన రాజ్యసభ సభ్యుడు ఖలీతా, ఎలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌, తెదేపా ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావుతో కలిసి ఆయన బుధవారం పర్యటక కేంద్రమైన కొండకర్ల ఆవలో పర్యటించారు. ఆవలో బోటు షికారు చేశారు.

కొండకర్ల అందాలు, ప్రకృతి రమణీయత ఎంతో బాగున్నాయని, ఇటువంటి ఆవను వైకాపా ప్రభుత్వం ఐదేళ్లగా పట్టించుకోలేదన్నారు. మత్స్యకారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వలేదని, ఆవలో పూడికను తొలగించి చుట్టూ హద్దులు నిర్ణయించి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. ఆవ విస్తీర్ణంపై సర్వే నిర్వహించి అక్రమాలు ఉంటే తొలగించి ఆద్భుతంగా మార్చుతామన్నారు. ఆవలో లభించిన కమలాన్ని కోసి ఎంపీగా పోటీ చేస్తున్న తనకు ఈ గుర్తుకు, అసెంబ్లీ అభ్యర్థి విజయ్‌కుమార్‌కు గ్లాసు గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. నాయకులు రాజాన సన్యాసినాయుడు, గొంతిన భక్తసాయిరాం, బైలపూడి రాందాసు, జనపరెడ్డి శ్రీనివాసరావు, అగ్గాల హనుమంతరావు, మేరుగు కాసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని